Monday, December 23, 2013

మన పాపముల నుంచి రక్షించి పరలోకం చేర్చే ఒకే ఒక్క మార్గము యేసు క్రీస్తు

మన పాపముల నుంచి రక్షించి పరలోకం చేర్చే ఒకే ఒక్క మార్గము యేసు క్రీస్తు

ఆజ్ఞ అతిక్రమే పాపము, అంటే దేవుడు ఏదైతే చెయ్యవద్దు అని చెప్పారో అది చెయ్యటమే పాపము. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. మన దోషములు మనకును దేవునికిని అడ్డముగా వచ్చుచున్నవి, దేవుడు పరిశుద్దుడు, అయనలో ఏ పాపమూ లేదు మనము కూడా పాపము లేకుండా పరిశుద్దముగా ఉంటే తప్ప దేవుని చేరలేము. మన పాపముల పరిహారం కోసం పరిశుద్ధ రక్తం చిందించబడాలి, అయితే జంతువుల యొక్క రక్తము వలన పాపములను తీసివేయుట అసాధ్యము, మానవుల పాపములను మనుషులు ఎవరు తీసివేయలేరు, ఆ దేవుడు ఒక్కడే మన పాపముల నుంచి మనలను విమోచింపగలరు. కాబట్టి ఆ దేవుడే మనకు మరియు దేవునికి మధ్యవర్తిగా సుమారు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్బమున బాల యేసునిగా జన్మించి, ముప్పది మూడున్నర సంవత్సరాలు మానవుడిగా జీవించి, దేవుని గురించిన జ్ఞానము బోదించి, రోగులను స్వస్థపరచి, అనేక అద్బుతాలు చేసి, దేవుడై ఉండి కూడా అయన సృజించిన మనల్ని రక్షించడం కోసం, మన పాపములను అయన తన మీద వేసుకుని సిలువలో మన పాపముల నిమిత్తము రక్తము కార్చి, మరణించి, మూడవ దినమున తిరిగి లేచి, 40 దినములు శిష్యులకు కనిపించి, పరలోకమునకు ఆరోహణుడైనాడు.

తాను సృష్టించిన సృష్టి అయిన మనకోసం తన దైవత్వాన్ని విడిచిపెట్టి నరుడిగా వచ్చిన యేసు నందు విశ్వాసముంచి మన పాపములను ఒప్పుకుని, క్షమించమని ప్రభువైన యేసుని వేడుకొని మారుమనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము యేసు నామములో బాప్తీస్మము పొంది, ఆయనను పోలి నడుచుకుంటే, మునుపు దేవునికి దూరస్తులైన మనలను, అయన సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తముతో మన పాపములను కడిగి, సమాధానపరచి, దేవునికి సమీపస్తులనుగా చేసి, మనలోనికి పరిశుద్దాత్మ రూపములో వచ్చి ఆ దేవుడే మన దేహాన్ని ఆలయముగా చేసుకుని నివసిస్తూ, మనలను పాప లోకము నుంచి వేరు చేసి పరలోక మార్గములో నడిపించును.

ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే మనము పరలోకం చేరగలము. 
మనము ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు సోదరా, నేడే రక్షణ దినము.
యేసు మనకొరకు భూమిపై మానవుడిగా పుట్టెను - హల్లెలూయ

Followers